BSNL Featured Mobile Phone Detel D1 Rs. 499

ఇప్పుడు featured phoneల హవా నడుస్తోంది. Nokia 3310 వస్తోందనగానే ఎంత హడావుడి చేశారో ఆ తర్వాత JioPhoneకీ అంతకన్నా ఎక్కువ డిమాండ్ లభించింది.

ఇప్పుడు BSNL అన్నింటి కన్నా తక్కువ ధరలో కేవలం 499 రూపాయలకి Detel D1 పేరిట ఓ featured phoneని తీసుకు వచ్చింది. Mobile phone తయారీ సంస్థ సహకారంతో BSNL దీన్ని తీసుకు వచ్చింది. మామూలుగా ఈ phone ధర కేవలం రూ. 346 మాత్రమే. అయితే BSNL ఈ phoneతో పాటు అందిస్తున్న offerతో కలిపి ఇది 499 రూపాయలకి విక్రయించబడుతోంది.

ఈ Detel D1 phone కొనుగోలు చేసిన వారికి 153 రూపాయల talktime ఇవ్వబడుతుంది. BSNL నుండి ఇతర BSNL నెంబర్లకి చేసే voice calls కేవలం నిముషానికి 15 పైసలు వసూలు చెయ్యబడతాయి. ఇతర నెంబర్లని నిముషానికి 40 పైసలు వసూలు చేస్తారు. 365 రోజుల పాటు ఈ టారిఫ్ అమల్లో ఉంటుంది.

1.44 అంగుళాల monochrome displayని కలిగి ఉండే ఈ Detel D1 phoneలో కేవలం 2G network మాత్రమే పనిచేస్తుంది. అలాగే ఇది ఒకటే SIMని సపోర్ట్ చేస్తుంది. 650 mAh బ్యాటరీ ఈ phoneలో నిక్షిప్తం చెయ్యబడింది. మిగతా అంతా బానే ఉన్నా మిగతా సంస్థల నుండి free calls లభిస్తున్న తరుణంలో 15, 40 పైసల చొప్పున టారిఫ్‌ని ఎంతమంది ఇష్టపడతారో చూడాలి.

Post Author: Telugubreakingnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *